Categories
ముంబాయి కు చెందిన అక్క చెల్లెళ్ళు కామాక్షి విశాల మురికివాడల్లో పిల్లల కోసం ది సౌండ్ స్పేస్ ఆన్ వీల్స్ ఏ మొబైల్ మ్యూజిక్ క్లాస్ రూమ్ ప్రారంభించారు.రకరకాల బొమ్మలు ఒక పసుపు పచ్చ రంగు వేసిన మొబైల్ బస్సులో సంగీత పరికరాలు ఆరుగురు ఇన్స్ట్రక్టర్లు ఉంటారు.ముంబై లోని సిమ్లా నగర్, పోలీస్ క్యాంప్, లోటస్ క్యాంప్ వంటి పేదల బస్తీల్లో ఈ బస్సు తిరుగుతుంది ఈ సంచార పాఠశాల కామాక్షి విశాల వినూత్న ఆలోచన సంగీతం పట్ల ఆసక్తి ఉన్న నిరుపేద పిల్లల కోసం తిరిగే ఈ మొబైల్ బస్సు క్రౌడ్ ఫండింగ్ ద్వారా నడుస్తోంది.