అంతర్ లివింగ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద వాళ్ల కోసం ప్రత్యేకంగా నివాస గృహాలు నిర్మిస్తోంది తారా సింగ్ వచాని  ఆమె మ్యాక్స్ గ్రూప్ చైర్మన్ అనాల్జిత్ సింగ్ కూతురు సింగపూర్ లో చదువుకున్న తారా వృత్తి రీత్యా ఇళ్లకు దూరంగా ఉండటం, లేదా భార్య పిల్లలు విదేశాలకు వెళ్లడంతో ఒంటరిగా ఉండే పెద్ద వాళ్ల కోసం మొదటి డెహ్రడూన్లో 15 ఎకరాల టౌన్ షిప్ లో 200 విల్లా లతో ఓ ప్రాజెక్ట్ నిర్మించింది.ఈ విల్లాలో 50 ఏళ్ల పైబడిన వాళ్ళకి వీల్ చైర్ ఫ్రెండ్లీగా ఉండే ఈ విల్లాలు భోజన, వైద్య సదుపాయాలు, జిమ్,ఈత కొలను, గ్రంథాలయము, సినిమా థియేటర్, స్పా వెల్ నెస్ సెంటర్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఈ విల్లాలు కొనుక్కోవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు ఇలాంటి విల్లాలు డెహ్రాడూన్ తో పాటు ఢిల్లీలోనూ నిర్మించింది తారా సింగ్ ఈ ఆలోచన విజయవంతం అని ప్రత్యేకంగా చెప్పే పనే లేదు.

Leave a comment