రసాయనాలు లేని సబ్బులు ,షాంపూలు వుండవు కనుక హాయిగా కుంకుడు కాయలు వాడుకోండి ,అని సహజమైన కండిషనర్ లాగా నూ ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కుంకుడు కాయలు నాననిచ్చి చక్కని గుజ్జుగా చేసి ఆలివ్ నూనె కలిపితే చక్కని షేవింగ్ క్రీమ్ తయారవుతుంది. కుంకుడు రసం మొక్కల పైన చల్లితే అవసనకు కిమికీటకాదులు నశిస్తాయి . బంగారు నగల్ని కుంకుడు రసంతో కడుగుతే మెరుస్తాయి . ఇకపోతే కార్పెట్లు ,టాయ్ లెట్స్ ,సింకులు అద్దాలు ,కిటికీలు సర్వం కుంకుడు రసంతో శుభ్ర పడతాయి . కుంకుళ్ళలో ఉండే సాపోనిస్ అనే రసాయనం మంచి  క్లెన్సార్ మాత్రమే కాదు యాంటీ ఫంగల్,యాంటీ బాక్టీరియల్ కూడా . ఊల్ సిల్క్ పట్టు వంటి కుంకుడు రసంతో ఉతికితే చక్కని మెరుపుతో కనిపిస్తాయి . ఈ కుంకుడుకాయలు ఇంటినీ,ఒంటినీ శుభ్రం చేస్తాయి .

Leave a comment