మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్న పది దేశాల్లో ప్రముఖ వృత్తి నిపుణుల సామాజక అనుబంధ సంస్థ లింక్డ్ ఇన్ ఒక అధ్యయనం నిర్వహించింది. మన దేశంలోని పెద్ద కంపెనీల్లో మహిళలను ఉన్నత స్థానంలోకి తీసుకోవడం మునుపటి కంటే మెరుగుపడిందట. తరాల తరబడి ఎంతో వెనుకబడినా అత్యధికంగా, అతివేగంగా పాతిక శాతం వృద్ది సాధించిందని రిపోర్ట్. ఇటీవల కాలంలో ఇలాంటి నియామకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి కానీ మగవాళ్ళతో పోల్చితే ఉన్నత స్థానాల్లో స్త్రీల ఉనికి అంతంత మాత్రమే అంటోంది లింక్డ్ ఇన్. కెనడా, అమెరికా, ఫ్రాన్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ దేశాల్లోని మొత్తం ఉన్నత స్థానాల్లో మూడొంతుల మంది మహిళలే. ఇక రంగాల వారీగా విద్య, స్వచ్చంద సేవా రంగాల్లోనే స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. ఆరోగ్యం, ఫార్మా రంగాల్లో 40శాతంతో తర్వాతి స్థానం సాధించాయని లింక్డ్ ఇన్ అధ్యయన నివేదిక చెప్తోంది. చమురు, విద్యుచ్చక్తి రంగాల్లో పూర్తిగా వెనకబడి ఉన్నారని తేల్చింది రిపోర్ట్.
Categories