Categories
‘గో డూ గుడ్’ స్టార్టప్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్ తయారు చేస్తుంది ఖుష్బూ గాంధీ ముంబైలో పుట్టి పెరిగిన ఖుష్బూ నిఫ్ట్‌లో మెటీరియల్ డెవలప్మెంట్ కోర్సు చేసింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా చేస్తున్న ఈ వ్యాపారంలో ఇప్పటికి వరకు, ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలతో సింగిల్ యూజ్ ప్లేట్లు తయారు చేశారు. సి వీడ్ (సముద్రపు నాచు), తో ప్రింటింగ్ కోసం ఉపయోగపడే ఇంక్ తయారు చేశారు. నా ప్రయోగాలు నాకు లాభం తెచ్చి పెట్టటం తో పాటు సస్టైనబుల్ లైఫ్ స్టయిల్ వైపు సమాజాన్ని నడిపించడంలో సాయం అవుతాయి. నా ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ప్రజలకు చాలా తొందరగా దగ్గరయింది అంటుంది ఖుష్బూ.