మన ఫుడ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం ఎంత వరకు వెళ్లిందంటే ఎన్నో రకాల పానీయాలు ఇప్పుడు పొడి రూపంలో ప్యాకింగ్ లో కనిపిస్తున్నాయి. ఏ కాలం లో ఏ రసం తాగాలన్నా అప్పుడప్పుడు ఓ స్పూన్ పొడి గ్లాసుడు నీళ్ళలో వేసుకుంటే సరిపోతుంది. కోయంబత్తూరులోని షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాదాపు పాలపొడిలా కనిపించే చెరుకు రసం పొడిని తయారు చేశారు. ఈ పొడి నీళ్ళతో కలిపి తాగితే అచ్చం చెరుకు రసం అన్నమాట. పంచదారకు బదులు ఇతర ఆహార పదార్ధాల తయారీలో, ఆయుర్వేద ఔషధాలలో దీన్ని వాడుకోవచ్చు. పైగా అసలు చెరుకు రసంలోనిఖనిజాలు ఏవీ దెబ్బతినకుండా అదే రుచితో వుంటుంది. ఈ పొడికి అల్లం, నిమ్మరసం వంటి ఫ్లేవర్లు కలిపి అమ్ముతున్నారు. చెరుకు పండే కాలంలోనే కాక ఎప్పుడైనా ఫ్రెష్ చెరుకు రసం తాగాలంటే హాయిగా మన ఇంట్లో పొడి రూపంలో డబ్బాలోంచి ఓ స్పూన్ తీసి కలుపుకొంటే చాలు. ఇలాంటివే కొబ్బరి నీళ్ళ పొడి, మజ్జిగ పొడి దొరుకుతున్నాయి. ప్రయాణాల్లో ఇలాంటి ప్యాకెట్లు తీసుకుపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, చెరుకు రసం రెడీగా ఉన్నట్లే.
Categories