Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/03/download.jpg)
జీవితంలో నిద్ర అంతర్భాగం, ఇది నేరుగా పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇందుకు ఎన్నో పోషకాలు సహకరిస్తాయి. మెగ్నీషియం చాలా ముఖ్యమైన పోషకం గింజలు, నట్స్ , క్యారెట్స్, చిలకడ దుంపలు, ఆకు కురలు, చేపలు, పూర్తి స్థాయి ధాన్యాలు, డార్క్ చాక్లేట్లు, అరటిపండ్లు మెగ్నీషియంకు ఆధారం. పెరుగు,కీరా ,ఓట్స్ ,చేపలు పోటాషియంకు ఆధారం. కాల్షియం శరీరానికి విశ్రాంతి ఇవ్వగల అతి ముఖ్యమైన పోషకం. ప్రోటీన్లు నిద్ర క్వాలిటీని పెంచుతాయి. గుడ్లు,ఓట్స్ , బీన్స్ గింజలు, నట్స్ ,ఆకుకూరలు, సీ ఫుడ్ లో ప్రోటీన్ సమృద్దిగా లభిస్తుంది. సమతు ఆహారం తీసుకోవటం వల్ల మంచి నిద్రపడుతుంది. పడుకునే ముందు చక్కెర పదార్ధాలు తీసుకోకూడదు.