ఈశాన్య రాష్ట్రల్లోని లోక్ తక్ సరస్సులో సహజ సిద్దంగా ఏర్పడే నీటి పై తేలే దీవులున్నాయి. వీటిని పుమాదీలు అంటారు. నీళ్ళలో పెరిగే గడ్డి,కుళ్ళి పోయిన మొక్కలు కొంత మట్టి కలిపి దీవుల్లా ఏర్పడి నీటి పైన తేలుతుంటాయి .వీటిని ఫ్లోటింగ్  లేక్ అంటారు ఈ పుమాదీ లతో సరస్సు తీరంలో  ఏర్పడిన కేయిబుల్ లంజావో జాతీయ పార్క్ ప్రపంచంలో ఇదొక్కటే. ఈ తేలే దీవుల్ని చూస్తూ సరస్సులో బోటింగ్ చేసే సందర్శకులకు ఈ దీవులపైకె  కేఫీ టెరియలు ఏర్పాటు చేశారు నీటి పై ప్రయాణం ఒక అనుభవం అయితే ఈ దీవుల్ని చూస్తూ ఆనందించటం ఇంకో గొప్ప అనుభవం.

Leave a comment