టమోటోల్లో ఉండే విటమిన్ ఎ,సి లు యాంటీ ఆక్సిడెంట్లు మోహ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. టమాటో ప్యూరీ తో స్క్రబ్బింగ్, క్లీనింగ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.శెనగపిండి, గంధం పొడి, టమాటో గుజ్జు, పెరుగు, పసుపు, నిమ్మరసం తీసుకుని ఈ మిశ్రమం తో మొహానికి ప్యాక్ వేసుకుంటే,శుభ్రంగా ఉంటుంది. స్క్రబ్బింగ్  కోసం బియ్యంపిండి, టమాటో గుజ్జు, పచ్చిపాలు, పసుపు మిశ్రమం కావాలి ఇక ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే టమోటో గుజ్జు, గంధం, పెరుగు తీసుకోని ఆ మిశ్రమంతో ప్యాక్ వేసుకోవచ్చు.వారానికి ఒక రోజు ప్యాక్ వేసిన చర్మం మెరుపుతో ఉంటుంది.

Leave a comment