Categories
గర్భధారణ కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముందుగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు కొంత మార్చుకోవాలి. ఇంట్లో పని ప్రదేశాలలో, రసాయినాలు నిండిన వాషింగ్, క్లీనింగ్ ఉత్పత్తులు కుడా ఒక రకంగా హానికరమే. అధిక బరువు వుంటే వ్యాయామాలు సమతులాహారం తీసుకుని బరువు తగ్గించుకోవాలి. సరైన బరువుంటే గుండెకు సంబందించిన సమస్యలు రక్త పోతూ పెరగడం వంటివి వుండవు. వ్యాయామాలు చేస్తే గర్భం ధరించాక సాధారణంగా వచ్చే వెన్ను నొప్పి నీరసం ఇబ్బంది పెట్టవు. అలాగే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఒత్తిడి ఎంతమాత్రం సమంజసం కాదు ప్రశాంతంగా వుండటం తప్పని సరిగా అలవాటు చేసుకోవాలి.