Categories
అమెరికాలో ప్రతినిధుల సభ (హౌస్ అఫ్ రిప్రజంటేటివ్స్ )కు,వర్జీనియా నుంచి తొలిసారి తెలుగింటి మహిళ తొలిసారి తెలుగింటి మహిళ మంగా అనంతాత్ముల రిపబ్లికన్ల తరుఫున బరిలో దిగుతున్నారు.ఆసియన్ హక్కుల ఉద్యమకారిణిగా సుపరిచితురాలు. 1990లో అమెరికా వచ్చారామె. మొదట్లో రక్షణ శాఖ కొనుగోళ్ల విభాగంలో ఫెడరల్ ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. తొలిసారిగా వర్జీనియా రాష్ట్రం 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి నామినేషన్ వేశారు.ఆమె పోటీపడుతున్న నియోజవర్గం లో,గెర్రీ కనోలీతో ఆమె పోటీపడుతున్నామె. నేను గెలిస్తే వలసల హక్కుల కోసం పోరాడుతాను అంటోంది మంగా అంతాత్ముల.