Categories

అమ్మాయిలు ప్రొఫెషనల్ కోర్సుల కోసం తప్పని సరిగా హాస్టల్స్ లో ఉండవలసి వస్తుంది. ఎక్కడ సీటోస్తే అక్కడే చదవాలి. కనుక తప్పదు. కానీ మెస్ భోజనంతో ఆరోగ్యకరమైన పోషకాలు ఏమీ దొరకపోవచ్చు.పెరిగే వయసులో జీవక్రియ వేగం ఎక్కువే . హస్టల్ లో దొరికే ఆహారంతో సరిపెట్టుకోక ,కొన్ని ప్రత్యామ్నాయాలు చూడటం మంచిది. పండ్లు ,పెరుగు ,మజ్జిక బయట ఎక్కడైన దొరుకుతాయి. రోజు కనీసం రెండు మూడు రకాల పండ్లు అరటి,ఆపిల్ ,కమలా ,సపోటా వంటివి తినాలి.అలాగే ఉదయం లేవగానే బాధం గింజలు తింటే రోజంతా ఉత్సహాంగా ఉంటుంది.బయట భోజనం చేయటం గురించి ఆలోచించకుండా హస్టల్ భోజనం వేళకు తిని, కాసేపు నడవటం,జాగింగ్ వంటి శరీరక వ్యాయామం చేస్తే మంచిది.