Categories
శుభ్రత కోసం తరుచు చేతులు కడుక్కోవటం మంచిదే .కానీ పొడి చర్మం గలవాళ్ళు సబ్బుతో అస్తమాను చేతుల కడిగినా, శానిటైజర్ రాసినా చేతులకు పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది .అదే జరిగితే బాక్టీరియాలు శరీరం లోకి ప్రవేశించే అవకాశం ఉంది .మంట దురదలు వస్తాయి .ఇలాంటి సమస్యలు రాకుండా సువాసనలు లేని తేలిక పాటి నురగ వచ్చే సబ్బులు ఉపయోగించాలి .కడిగాక పైన పొరగా ఏర్పడేవి వద్దు .ఈ పొర చర్మం నుంచి వచ్చే సహజ ద్రవాలను రాకుండా చేస్తుంది .సువాసనలు వచ్చే కాస్మొటిక్స్ ఏవి సున్నితమైన చర్మానికి సరిపడవు .గది ఉష్ణోగ్రత ఉన్న నీటితో చేతుల కడిగాక పొడి టవల్ తో తుడుచుకొని మాయిశ్చరైజర్ పూయాలి .ఇప్పటికే పగిలి ఉంటే ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండే శానిటైజర్ కాకుండా మాయిశ్చరైజర్ శానిటైజర్ వాడవచ్చు .