Categories
నేను ప్రెగ్నెన్సీ బైబిల్ పుస్తకాన్ని రాసింది గ్లామర్ కోసం కాదు, ఆ సమయంలో ఎంత నిస్సహాయత ఉంటుందో, ఎంత ఆందోళన పడతామో కానీ అదంతా తాత్కాలికం అని వర్కింగ్ ఉమెన్ తెలుసుకోవాలని రాశాను అంటుంది కరీనా కపూర్. గర్భం దాల్చాక నేను నా పనులన్ని వాయిదా వేశాను ఫిట్ నెస్ పోయింది మా పెద్దబ్బాయి తైమూర్ ని కంట్రోల్ చేయటం కష్టం అయింది .నెర్వస్ గా ఉండేదాన్ని కానీ ప్రపంచంలో అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రెగ్నెన్సీ ఇబ్బందులకు భయపడకండి అని చెప్పేందుకే ఈ పుస్తకం రాశాను అంటోంది కరీనా కపూర్.