ఏ రంగం అయినా  అత్యుత్తమంగా ప్రయత్నించటం నా లక్ష్యం అంటోంది గాయని ప్రియదర్శిని  ప్రతిష్ఠాత్మకమైన  గ్రామీ పురస్కారానికి ఆమె తొలి ఆల్బమ్ ‘పెరిఫెరీ’ నామినేట్ అయింది. ఎంతోమంది సుప్రసిద్ధ కళాకారులతో కలిసి ఆమె పనిచేశారు. ఏపీ కోరస్ బ్యాండ్ లో భాగస్వామి ప్రియదర్శిని ట్రయో పేరుతో సొంతంగాబ్యాండ్ స్థాపించారు ఉమెన్స్ రాగా మాసివ్ బ్యాండ్ కు ఆమె సహ నిర్వాహకురాలు జన రక్షిత అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి క్యాన్సర్ రోగులకు వైద్య పునరావాస సౌకర్యాన్ని అందిస్తున్నారు. మహారాష్ట్రలో రెండు పాఠశాలలు దత్తత తీసుకుంది. అల్ట్రా మారథాన్ లో హిమాలయాల్లో వంద మైళ్ల రేసులో పాల్గొన్న అతి తక్కువ వయస్సు ఉన్న మహిళగా ప్రియదర్శిని రికార్డు సృష్టించింది.

Leave a comment