Categories
నిద్ర లేస్తున్నే శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. వెల్లికిలా పడుకొని నిరంతరం కదులుతూ ఉండాలి లేకపోతే అనర్థమే అంటాయి అధ్యయనాలు. సైక్లింగ్, స్క్యాట్స్ వంటివి చేస్తే కండరాలు శక్తిని పుంజుకుంటాయి.ఫోనొస్తే నడుస్తూ మాట్లాడాలి కాళ్ళు మడమలు తిప్పుతూ ఉండాలి. ప్రతి ఇరవై నిమిషాలకీ రెండు నిమిషాలు లేచి నిలబడాలి రెండు గంటలకోసారి వెన్ను భుజాలు చేతి కండరాలు కదిలేలా నవ్య అపసవ్య దిశలో కదలించాలి. నీళ్ల సీసా, చున్నీ, తాడు, కర్ర ఏది చేతికి దొరికితే వాటితో వ్యాయామాలు చేయాలి. మెడను ఎడమనుంచి కుడికి కుడినుంచి ఎడమకు తిప్పాలి. శరీరాన్ని ఎటు పడితే అటు వంచగలిగితేనే ఆరోగ్యం. కదలకపోయిందా అంతే సంగతులు !