అమెరికన్‌ పాప్‌ సింగర్‌ రిహాన్నా తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఓ నివేదికలో ఫోర్బ్స్‌ ‘రిచెస్ట్‌ లేడీ మ్యూజీషియన్‌’గా సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నారు.  ఎంత చక్కగా  పాడగలరో అంత సమర్థవంతంగా వ్యాపారం చేస్తూ అత్యంత సంపన్న సంగీత విద్వాంసురాలు గా నిలబడింది. రిహన్నా పాటలు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ సింగిల్స్ గా నిలిచాయి. 2017లో ‘ఫెంటీ బ్యూటీ’ పేరుతో బ్యూటీ ఉత్పత్తులను మార్కెట్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 1.7 బిలియన్ డాలర్ల గా ఉండటం తో ఫోర్బ్స్ జాబిదాలో ఓప్రా విన్‌ఫ్రే తరువాత రిహాన్నా రెండో స్థానంలో నిలిచింది. ‘సావెజ్‌ ఎక్స్‌ ఫెంటీ’ బ్రాండ్ కూడా ఆమెదే. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో రిహానా ఎంతో మంది స్ఫూర్తి గా నిలుస్తోంది.

Leave a comment