ఎప్పటి కప్పుడు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి , లేదా ఎవరికీ వాళ్ళు కొత్త జాబ్స్ సృష్టించుకొంటున్నారు . అమెరికాకు చెందిన రాబెల్లె డగ్లాస్ అలాటి ఒక గొప్ప ఐడియా సృష్టించింది . ప్రొఫెషనల్ ప్రిన్సెస్ గా మారిపోయింది . చిన్ని చిన్ని పార్టీలు సెలబ్రేషన్స్ లు ఆమె డిస్ని రాకుమారి గా అంబెండ్ అవుతుంది . వేషభాషలు ముఖ కవళికలు నడత నటన అలాగే ఉంటాయి . ఇలా తయారయ్యేందుకు ఆమెకు గంటన్నర సమయం పడుతుందట ,వారానికి 30 గంటలు రిహార్సల్ వేసుకొంటుంది . పార్టీలు ,బెల్లె ,ఎల్సా ,పరియల్ వంటి క్యారెక్టర్ల లో అతిధులను అలరిస్తుంది . ఇలా ఎంటర్ టైన్ చేసినందుకు గంటకు వంద యురోలు తీసుకొంటుందట .