టి,కాఫీలు తాగేస్తాం కదా వాడకటిన ఆ టి,కాఫీ,పొడిని బయట పారేయద్దు అవి సౌందర్య పోషణకు సేంద్రీయ ఎరువుగాను ఉపయోగపడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ వాడేసిన టి పొడి నీళ్ళలో మళ్ళి మరిగించి ఆనీళ్ళను చల్లార్చి ఆ నీటితో మొహం కడుకుంటే మొటిమలు తగ్గుతాయి. ఈ టి నీళ్ళు గోరు వెచ్చగా ఉండగానే ఆనీళ్ళను టబ్ లో పోసి పాదాలు మునిగేలా పెట్టి ఓ అరగంట అలాగే వుంచాలి. పాదాలకు వున్నా టాన్ సమస్య పోతుంది. కాఫీ పొడిని బాడీ స్క్రబ్ గా ఉపయోగించవచ్చు ఫ్రిజ్ లో దుర్వాసన రాకుండా ఓ గిన్నెలో వాడిన పొడిని వేసి ఫ్రిజ్ మూలగా ఉంచవచ్చు ,మరిగించిన టి,కాఫీల నీళ్ళతో ఫ్రిజ్ ను తుడిస్తే వాసనపోతుంది అలాగే మిగిలిన పొడిని ,ప్రతిరోజు ఓ కుండీలో వేసి పైన మట్టి జల్లాలి . ఆలా ప్రతి రోజు మిగిలిన పొడిని మట్టిలో కలిపి నిలువ చేస్తే అది మొక్కలకు సేంద్రియ ఎరువులా ఉపయోగ పడుతుంది.

Leave a comment