![](https://vanithavani.com/wp-content/uploads/2022/03/pandan-leaf.jpg)
పాండన్ ఆకులను ‘వెనిలా ఆఫ్ ది ఈస్ట్’ అని అంటారు మలేషియా థాయ్ లాండ్ శ్రీలంక వంటి దేశాల్లో ఆహార పదార్థాలకు ప్రత్యేక రుచి ఇచ్చేందుకు వీటిని వాడతారు. సాధారణ బియ్యానికి బాస్మతి రుచిని ఇస్తాయి. ఈ ఆకులు డిజర్ట్ లో,జ్యూస్ లో,సేవరీలకు ప్రత్యేక రుచి ఇస్తాయి తమిళనాడులో ఇడ్లిల్లో ఒడిస్సా పశ్చిమ బంగలోని కొన్ని ప్రాంతాల్లో స్వీట్స్ లో ఈ ఆకులు వాడుతారు ఈ ప్రాంతాల్లో వీటిని ‘అన్నపూర్ణ ఆకులు’ అని పిలుస్తారు.వీటిలో చుట్టి వండే పాండన్ చికెన్ కు దేశవ్యాప్తి అభిమానులున్నారు. ఈ ఆకులకు రంగు రుచి సువాసన ఇచ్చే లక్షణం తో పాటు ఔషధ గుణాలు ఎక్కువే అంటున్నారు అధ్యయనకారులు. ఈ ఆకులతో తయారు చేసే టి యాంటీఆక్సిడెంట్లు విటమిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో ఈ ఆకుల్ని నీటిలో మరిగించి తాగితే దాహం సమస్య పోతుంది.