ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి ప్రపంచంలో అత్యధిక దేశాలు మహిళల పాలనలో ఉన్నాయి ఒక 2021 లోని ఎనిమిది దేశాల తొలి మహిళా ప్రధాని ఎన్నుకున్నారు మహిళల సామర్థ్యం గురించి జరిగిన అధ్యయనాల్లో కోవిడ్ నిర్వహణలో మహిళా పాలనలో ఉన్న దేశాల్లో చాలా సులభంగా కోవిడ్ కు ముక్కు తాడు వేసినట్లు తేలింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వారికి ఇచ్చే గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ గ్రహీతలు రెండు వందల మందిలో 60 శాతం మహిళలే ఉన్నారు. నోబెల్ బహుమతుల్లో అన్నింటి కన్నా మహిళలు అందుకొన్నది శాంతి బహుమతే టోక్యో ఒలంపిక్స్ లో చరిత్రలో మొట్టమొదటిసారి క్రీడాకారుల్లో స్త్రీలు పురుషులతో సమానంగా హాజరయ్యారు.సేవల్లో,నాయకత్వంలో, ప్రతిచోట కీలక పాత్రలో మహిళలే ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

Leave a comment