మౌంటెన్ వ్యూ పేరుతో తమిళనాడులోనే ఉసిలంపట్టి లో ఓ స్కూల్ ప్రారంభించారు సామాజిక కార్యకర్త సుసానే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఈవిడ కూతురే ఇందులో ప్రస్తుతం 230 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఆధునిక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు సుసానే. పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ఉచిత వైద్య శిబిరాలున్నాయి. ఏడుగురు ఆడ పిల్లలకు తల్లి సుసానే. అందుకే ఆడ పిల్లలకు చదువు వల్ల కలిగే లాభం ఏమిటో ఆమెకు తెలుసు. అందుకే ఆడపిల్లల స్కూల్ స్థాపించారామె ఇది ఒకరి వల్ల అయ్యేది కాదు అందరూ ముందుకు వస్తేనే ఆడపిల్లల చదివించుకోగలుగుతాము. ఈ మంచి పనికి ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో ముందుకు రావాలని తాజాగా తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది కత్రినా.

Leave a comment