నీహారికా,

మనమో  కల కంటాం అది నిజం చేసుకోగల అవకాశాలు చాలా  తక్కువగా ఉన్నాయనుకో  మనం  కలకన్న టార్గెట్  ను రీచ్  అవ్వడం అసాధ్యం అనుకొనే వద్దు. ఎక్స్  పర్ట్స్ ఏం  చెప్పుతున్నారు అంటే  మన లక్ష్యాన్ని చిన్ని చిన్ని విభాగాలుగా విడగొట్టాలి. మనం ఎంత వరకు  పని చేయగలమో  అంత  చిన్న విభాగాలు  అన్నమాట. మనం మెట్ల  వరస అంతా  పైదాకా  చూడనక్కరలేదు. మొదటి  మెట్టు   చుస్తే చాలు  అన్నారో  జ్ఞాని. అలా మొదటిగా  చేయవలసిన పనులు  చిన్నవిగా విడకొట్టి  చేయడం మొదలు పెడితే  ఎంత పెద్ద పని అయినా  అసాధ్యం  కాదు. పైగా వెళ్లగలిగే దారి మన ముందు కనిపిస్తూ  ఉంటుంది. ఏ  పని ఏ విధంగా  చేయాలో  ఒక అవగాహన వచ్చి  పని మొదలు పెడితే ఖచ్చితం గా  అభివృద్ధి  కనబడుతుంది.

Leave a comment