నెయ్యి ఆరోగ్యానికే కాదు చర్మ రక్షణకు ఉపయోగం అంటారు ఆయుర్వేద వైద్యులు. నెయ్యి లో ఉండే ADEK విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన పోషకాలు ఇస్తాయి. క్రమం తప్పకుండా చర్మంపై రాస్తే మచ్చలన్ని పోతాయి. పెదవులు ఎండిపోయి పోట్టు రాలి పోతున్నట్లు అనిపిస్తే నెయ్యి రాయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. నిద్రపోయే ముందర పెదవులకు నెయ్యి రాస్తే  ఉదయానికి మెత్తగా ఉంటాయి. వాటర్ ప్రూఫ్ మేకప్ వంటివి తొలగించాలంటే నెయ్యి వాడచ్చు. వంటింట్లో పని చేస్తూ ఉంటే గరుకు బారిన వేళ్ళకు నేతితో మర్దన చేస్తే మృదువుగా మారిపోతాయి. నెయ్యి చర్మపు పొరల్లోకి చొచ్చుకు పోతుంది. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

Leave a comment