Categories
నీనా గుప్తా రాసిన సచ్ కహూ తో ఆత్మకథ మార్కెట్ లో ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవరి మాటా వినం కానీ పిల్లలు పుట్టాక మెల్లగా అన్ని అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి తల్లి తండ్రి ఇద్దరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్ అవుతారు అంటుంది నీనా గుప్తా. వివ్ రిచర్డ్ తో పాపను కన్నాక నేను ఒంటరి తల్లిగా మసాబా ను పెంచాను.వంటరి స్త్రీ ని సభ్య సమాజం ఎంత అసభ్యంగా చూస్తుందో నాకు ప్రాక్టికల్ గా తెలుసు. సింగిల్ ఉమెన్ అంటేనే పురుషులను వల్లో వేసుకునేవారు అనుకుంటారు ప్రజలు స్త్రీలు గా మీరు ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోవద్దు.మనలో ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది దాన్ని గుర్తించి జీవితంలో విజయం సాధించండి అంటుంది నీనా గుప్తా.