Categories
అపార్ట్ మెంట్ ఆఫీస్లలో ,ఆకాశహర్మ్యాల సంస్కృతి పెరిగిన నగర వాతావరణంలో తలుపులు మూసి ఏసీ ల కింద విద్యుత్ వెలుగుల కిందనే పని చేయటం అలవాటై పోతుంది. ఇలా రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ వెలుగుల్లో పని చేస్తూ ఉంటే జీవన గడియారం దెబ్బతిని సాయంత్రం అవగానే అలసట రాత్రి ఎంత సేపు నిద్రపోయినా చాలకపోవటం లేదా ఎంతకీ నిద్ర రాకపోవటంతో ఆరోగ్యం దెబ్బ తింటూ ఉంటుంది. కండరాలు బలహీనపడి ,ఎముకలు పెలుచు బారీ ,రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని ఎన్నో సమస్యలు వస్తున్నాయని పరిశోధకులు చెపుతున్నారు.