Categories
వంటగదిని పోషకాలతో నింపేయండి లేకపోతే కొన్నిసార్లు మంచి ఆహారం తినటం కూడా సమస్య అయి పోతుంది. వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్ తీసుకొంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దక్కుతాయి. బీన్స్ లో ఉండే పీచు ,యాంటీ ఆక్సీడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ట్రై గ్లిజరైడ్స్ పెరగనివ్వవు. బరువు తగ్గించుకోవాలను కొనేవారు బీన్స సందేహాం లేకుండా తినాలి. అరకప్పు బీన్స్ లో ప్రోటిన్లు ,విటమిన్లు పుష్కలంగా దోరికినట్లే .వీటిని ఉడికించిన తర్వాత కూడా వీటిలో 70 శాతం పోషకాలు ఎక్కడికీ పోవు.అరకప్పు బీన్స్ తాజా పాలకూర కొద్దిగా కీర ,టమోటో జ్యూస్ ఉడికించిన గుడ్డుతో ఉదయపు పోషకాలు పుష్కలంగా దక్కినట్లే.