Categories
ఆహారంలో ఉప్పు కాస్త తక్కువగానే ఉంటే ఆరోగ్యం సగటున ఎనిమిది గ్రాములు అంటే సగం స్పూన్ ఉప్పు తింటే చాలు.అదే ఆరోగ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.ఆహారంలో ఉప్పు తగ్గించడం పెద్ద కష్టం కాదు పండ్లు నట్స్ గింజల్లో ఉప్పు అక్కర్లేదు.కారం ఎక్కువగా లేని పచ్చళ్లలో కూడా ఉప్పు తగ్గించుకున్న రుచి లో తేడా ఉండదు.పాలకూర క్యారెట్ మొదలైన వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది తేనే ఆహారపదార్థాల్లో ఎంత ఉంటుందో లెక్క చూసుకోవాలి.ప్రాసెస్డ్ ఫుడ్ సాప్ ల్లో అదనపు ఉప్పు ఉంటుంది. బేకరీ పదార్థాలు తగ్గించి ఇంట్లో జాగ్రత్తగా వంటకాలు తింటే ఎక్కువ ఉప్పు శరీరంలో చేరకుండా ఉంటుంది.