సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ గా ఆయన కుమార్తె సారా టెండూల్కర్ నియమితురాలయింది. మారుమూల పల్లె ప్రాంతాల్లోని పిల్లలకు వైద్య సేవలు అందిస్తూ పోషకాహార  లోపాన్ని అధిగమించేలా ఈ ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. సారా టెండూల్కర్ లండన్ లోని యూనివర్సిటీ నుంచి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ లో మాస్టర్ చేసింది .ఈ విషయాన్ని గురించి చెబుతూ మా అమ్మాయి సారా ఎస్ టి ఎఫ్ డైరెక్టర్ కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆమెకు వైద్య రంగంలో ఉన్న పరిజ్ఞానం చాలామంది గ్రామీణ ప్రాంత చిన్నారులకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించబోతోంది అన్నారు సచిన్ టెండూల్కర్.

Leave a comment