గణనాయకాయ..గణదైవతాయ….

గణాధ్యక్షాయ ధీమహీ!!

తొలి పూజతో అవిఘ్నమస్తూ అని విఘ్నం కలుగకుండా కాపాడే నాధుడు గణనాధుడు.విశాఖపట్నం నడిబొడ్డులో సంపదలతో తులతూగమని అభయ మిస్తున్నాడు గమనించండి.
విశాఖ సముద్ర గర్భంలో జరిగిన అలజడి నుండి కాపాడిన ఘనత మరి ఈ గణపతె నండోయ్. ఆలయం చిన్నగా ఉన్నా భక్తులు తమ కోరికలు తీర్చే గణపయ్య అని తండోపతండాలుగా వస్తారు. సంపద,సంతాన ప్రాప్తి కలుగుతుంది అని భక్తుల నమ్మకం.

నిత్య ప్రసాదం: కొబ్బరి అన్నం,కొబ్బరి కాయలు,పండ్లు,కోరిక తీరింది అంటే స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ఉండ్రాళ్లు మహా ప్రసాదంగా నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment