Categories
1911లో హైదరాబాద్ దగ్గరలోని ఘట్కేసర్ లో జన్మించిన ఆడ సంగం లక్ష్మీబాయమ్మ వినోబాభావే శిష్యురాలు పార్లమెంట్ మెంబర్ గా 20 ఏళ్లున్నారు 1952లో సైదాబాద్ లోని తమ సొంత భవనం లో ఇందిరా సేవా సదనం స్థాపించారు. తనకున్న సమస్త సంపదలు దానికే ధారపోశారు లక్ష్మీబాయమ్మ. 1952 లోనే జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్,బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖండ విజయం సాధించారు. విద్యాశాఖ ఉపమంత్రిణిగా పనిచేశారు. ఈ పదవి అలంకరించిన ప్రథమ తెలంగాణ మహిళా ఆమెనే. గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ఆమెను తామ్ర పత్రం తో ప్రభుత్వం గౌరవించింది.