Categories
సంగీత ప్రపంచం లో ఓ ప్రభంజనం జస్లీన్ రాయల్ విజయ్ దేవరకొండ తో చేసిన మ్యూజిక్ వీడియో పాట ఇప్పుడు వైరల్ అవుతుంది. రెండు వారాల్లో దాదాపు రెండు కోట్ల వ్యూస్ సంపాదించుకుంది. జస్లీన్ రాయల్ గాయని, మ్యుజీషియన్ గా కంపోజర్ గా యువతను ఆకట్టుకుంది. పంజాబ్, హిందీ గుజరాతీ లతో పాటు ఇంగ్లీషులోనూ పాటలు పాడింది. మహిళా మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. బాలీవుడ్ లో కంపోజర్ గా స్థానం సంపాదించుకుంది. షోక్ పాప్, ఆధునిక సంగీతాలను మేళవించి జస్లీన్ చేసే ప్రయోగాలు యువత గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.