మనదేశంలో శారీ మార్కెట్ విలువ 53 వేల కోట్లు పైగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.చీరలో వచ్చినన్ని ఫ్యాషన్లు మరే  డ్రెస్ లోను రాలేదు. చీరకట్టు పైన ది శారీ సిరీస్ పేరుతో 80 పైగా షార్ట్ ఫిలిమ్స్ తీసింది మాలికా వర్మ డాలీజైన్ అనే శారీ  డ్రేపర్  ఒకే చీరని 300 రకాలుగా కట్టి రికార్డు సృష్టించింది. రీటా కపూర్ బిస్తి దాదాపు 14 రాష్ట్రాల్లో రకరకాల చీర కట్టు పైన పరిశోధన చేసి 180 రకాల చీర కట్టే విధానాలను శారీస్, ట్రెడిషనల్ అండ్ బియాండ్ అన్న పుస్తకంలో పొందుపరిచింది. హోదాని అధికారాన్ని కనబరిచే చీర ఒకటే చిరకాల ఫ్యాషన్.

Leave a comment