నీహారికా,
మన చుట్టూ వున్న వతావరణం అనునిత్యం చూసే విషయాలు, వినే కబుర్లు ఇవే మనలో కలిగే ఎన్నో ఉద్రేకాలకు , ప్రకోపాలకు కారణం అవ్వుతున్నాయని ఒక మీడియా సమావేశంలో నిపుణులు వెల్లడించారు. విలువలతో కూడిన ఒక జీవితానికి బుద్దుడు చెప్పిన సమ్యక వాక్కు ని పాటించాలన్నారు. అంటే మంచి మాటలు, మంచి ప్రవర్తన తో వుంటే మంచి సమాజం మన చుట్టూ రూపం పోసుకుంటుంది. ఇందుకు ఏం చేయాలట. ఉదయం లేస్తూనే హాయి గొలిపే దృశ్యాలు చూడాలి అంటే ప్రకృతిని చూడాలి. మనస్సు ఆహ్లాద పరిచే సంగీతం వినాలి. సంస్కారవంతమైన పరిసరాల్లో జీవించాలి. కుటుంబంలో ఒక స్నేహ పూరిత వాతావరణం వుండాలి. అక్కడ కోప ద్వేషాలకు, అణచివేతకు ఆస్కారం ఉండకూడదు. ఒక వేళ మనలో కోపం, ద్వేషం వంటి నెగిటివ్ భావాలు గనుక వుంటే వాటి ప్రభావం మన ఆరోగ్యం పైనే ముందుగా ప్రభావం చూపెడుతుంది. ఇలాగే కొనసాగితే శరీరం దీర్ఘకాలిక అనారోగ్యాలకు నిలయం అవ్వుతుంది. అందుకే ముందుగా ఎవ్వరికి వాళ్ళు శాంతిగా, ఉద్రేకాలు లేకుండా వుండే వాతావరం సృష్టించుకుని, ఆ చల్లని వాతావరణంలో కుటుంబ సభ్యులు సంతోషంగా జీవించేలా చూసుకోవాలి.