ఈ రోజుల్లో ప్రతి విష్యంలో స్పీడ్ రిజల్ట్స్ కావాలనుకుంటారు తలనొప్పి నిమిషంలో తగ్గాలి. ఇష్టమైనవి ఆర్డరిస్తే వాకిట్లోకి వచ్చి వాడాలి. కోరుకున్నవి చిటికేస్తే దొరకాలి. అలాగే శరీరం విషయంలో ఈ చిటికెలో సరిపోవు. సన్నగా నాజుగ్గా వుండాలి అనుకుంటే శరీర, జీవిత ఎధర్ధం గురించి అర్ధం చేసుకోవాలి. కొన్ని పాటిస్తే ఫిట్ గా స్లిమ్ గా ఉండచ్చు. యాపిల్ బిస్కెట్స్ ఎదురుగా వుంటే యాపిల్ తినాలి. ప్రకృతి సహజంగా లభించేదే ఆరోగ్యవంతమైనది. కూర్చున్న చోటు నుంచి లేకపోతె నష్టం. శారీరక శ్రమ కావాలి. ఎన్నో చిన్న చిన్న పనుల్లో శారీరక వ్యాయామం దాక్కుని వుంది. ఇంట్లో పనులన్నీ వంగీ లేస్తూ తీసుకోవాలి ఇల్లు శుబ్రం చేసుకోవాలి. ఇది స్త్రీ, పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఉదయం లేచి కాళ్ళకు చెప్పులు లేకుండా సూర్య కంటి శరీరం పైన పడేలా నడుస్తూ ప్రకృతి ఇచ్చిన ఆహారం తినాలి. ఇలా చేస్తేనే ఆరోగ్యం ఫిట్నెస్ రహస్యం కుడా ఇదే.

Leave a comment