కొందర్ని సెలబ్రెటీస్ అని నిస్సందేహంగా పిలవచ్చు. ఉదాహరణకు ఉర్వి సాబ్నిస్ కార్పోరేట్ కంపెనీలో చక్కని ఉద్యోగం చేసే వారు. అందమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్న ఉర్వి కి కాన్సర్ అన్నారు డాక్టర్. ఉర్వి ఈ అనారోగ్యాన్ని చాలా ధైర్యం తో ఎదుర్కున్నారు. ప్రాణాంతక మైన ఆపరేషన్ ను చేయించుకున్నారు. కీమోధెరపీని చేయించుకున్నారు. ఆమె మరణాన్ని జయించారు ఆహ్మదాబాద్ కు చెందిన ఉర్వి ప్రస్తుతం కాన్సర్ తో బాధపడే రోగులకు తన ధైర్యాన్ని పంచుతున్నారు. తన కధను చెప్పడం ద్వారా ఇతర కేన్సర్ రోగుల కుటుంబ సభ్యులతో ధైర్యం నింపుతున్నారు. ఉర్వి ఇచ్చిన సందేశం ఇదే. మనం అందంగా కనిపించావలిసిన పని లేదు.మన ఆలోచనల ధోరణిలో అందంగా వుండాలి. సానుకూల దృక్పదం తో తన ఆరోగ్యం కాపాడుకొన్నారు ఉర్వి. ఈమెను గురించి అన్నో వీడియోలు కధనాలు యుట్యూబ్ లో చూడొచ్చు.

Leave a comment