ఎవరైనా టెన్షన్ గా వుంటే వెంటనే అలా ఉండొద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పుతుంటారు. మాటి మాటికి ఆందోళన పడటం వల్ల శారిరానికి మంచిది కాదు అని ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యాయినంలో ఆసక్తి కరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఆందోళన పడటం కూడా మంచిదేనని ఆ రిపోర్ట్ సారంశం. ఆశర్యంగానే వుంటుంది. ఆందోళన పడటం వల్ల వ్యక్తులు తమ బాధ నుంచి స్వాంతన పొందుతారని. డిప్రెషన్ పాలవరని శాత్రవేత్తలు చెప్పుతున్నారు. అంతే కాదు ఇలాంటి వ్యక్తులు ఆరోగ్య పరంగా తమ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పుతున్నారు. వర్రీని నెగటివ్ అర్ధం లో వాడతాం కానీ అన్ని రకాల వర్రీలు నెగటివ్ కాదని , ఇవి మన్యుషులకు అనారోగ్యం కలిగించావని చెపుతున్నారు. ఇది వ్యక్తుల్లో మోటివేషన్ పెంచి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ఆందోళన పెంచే గుణం, భాధాకరమైన ఘటనలు జ్ఞాపకాల గురించి మనల్ని బయట పదేస్తుందిట. తొందరగా ఆందోళన చెందే గుణం వున్న వాళ్ళు చదువుల్లో, ఇతర యాక్టివిటీస్ లో ముందుంటారట.

Leave a comment