ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా ప్రయోజనం ఉండదు. కాస్సేపటికి పౌడర్ పోయి నలుపు కనిపిస్తుంది. ముందుగా కన్సీలర్ వేసుకుని పౌడర్ వేసుకోవాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదవులు పైన మృత కణాలు తొలగించి లిప్ బామ్ వేసుకుని లిప్ లైనర్ వేసుకుని మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలి. హేయిర్ స్ప్రే ని టూల్ బ్రష్ పై తీసుకుని కనుబొమ్మల్ని దువ్వుకుంటే రోజంతా చెదరకుండా ఉంటాయి.
Categories