Categories

అమ్మాయిలు నగలుగా ధరించాలి అంటే అవి అందంగా ఉండాలి సౌకర్యంగా ఉండాలి. పది మంది దృష్టినీ ఆకర్షించాలి. ఈ లక్షణాలన్నీ ధాన్యపు నగలకు ఉన్నాయి అన్ని రకాల ధాన్యపు గింజలు,ప్రకృతిలో దొరికే గింజలు కలిపి అందమైన నగలు చేస్తున్నారు డిజైనర్లు. ముందుగా గింజలను కావలసిన రంగుల్లో నాననిచ్చి ఎండబెడతారు. వాటిని ఒక్క గింజను నేర్పుగా కావలసిన ఆకారం లోకి తీసుకువస్తారు గింజల వరుసల్లో మెరిసే రాళ్ళు పొదిగి వాటిని ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు పసుపు ఎరుపు నలుపు నీలం వంటి రంగుల్లో హారాలు,జుంకీలు చెవులకు పెట్టుకొనే దుద్దులు,స్టార్స్ చాలా అందంగా ఉన్నాయి. గింజలు సహజమైనవే,నగలు సహజ వర్ణాలతో మెరిసిపోతున్నాయి.