Categories
WhatsApp

న్యూట్రిషనల్ ఫిట్ నెస్ చాలా అవసరం.

పోషకాహారం లభించక కలిగే అలసట, రోజంతా పని వత్తిడితో వచ్చే నీరసం ఇటువంటి వాటిని సింపుల్ గా వుండే పరిరక్షణ చర్యలతో అధిగమించే వీలుంది. రెగ్యులర్ గా చేసే ఎక్సర్సైజులు కంటే అదనంగా కొన్ని డైటరీ టిప్స్ పాటిస్తే శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీన్ని న్యూట్రిషనల్ ఫిట్ నెస్ అంటారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు తినాలి. వీటిలో కాన్సర్ నుంచి కాపాడే గుణాలు, మైక్రో న్యూట్రియంట్లు వుంటాయి. రోజంతా ఎక్కువ నీళ్ళు కొద్ది కొద్ది మోతాదులో ఆహరం తీసుకోవాలి. చిన్ని భోజనాల వల్ల ఆరోగ్యవంతమైన స్నాక్స్ వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా వుంటాయి. అలసటకు డీహైడ్రేషన్ప్రధాన కారణం. రోజంతా 8-10 గ్లాసుల నీరు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యవంతమైన ఫ్యాట్ గల స్నాక్స్ తినాలి. ఉప్పు లేని గుప్పెడు నట్స్. తాజా డ్రైఫ్రూట్స్, పెరుగు, కూరగాయల ముక్కలు, పూర్తి స్థాయి బ్రెడ్ చిరుతిండిగా తినాలి. శనగలు, బీన్స్. పప్పు ధాన్యాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇన్సులిన్ విడుదలను నెమ్మదింపజేసి శక్తిని స్థిరంగా అందిస్తాయి.

Leave a comment