సాయి శరణం బాబా శరణం శరణం
సాయి శరణం గంగా యమున సంగమ సమానం!!
గురువారం రోజు మన ఇష్టదైవాన్ని కొలుచుకోవచ్చు. ఈ రోజు శంషాబాద్ వెళ్లే దారిలో అత్తాపూర్ సమీపంలో వున్న ఓం నగర్ సాయి బాబా మందిరం చూసి వద్దాం పదండి!! ఇక్కడకి వచ్చి భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటే వారం రోజుల్లో మరి శుభవార్త వినాల్సిందే.అంత స్వచ్ఛమైన స్వరూపం.ఉద్యోగం,సంతానం,ఆరోగ్యం మొదలు అన్నింట బాబా వారి అభయం అమృతం. గురుపౌర్ణమి,బాబావ్రతం,వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి.సాయి బాబా వారి ప్రతిష్ఠ పీఠాధిపతులు ఆధ్వర్యంలో జరిగింది .మందిరానికి పెద్దలు చలపతి రావు గారు,మోహన రావు గార్ల ప్రత్యేక శ్రద్ధ ఎంతో మంది భక్తులకు కొంగు బంగారం.భక్త సమాజం సభ్యులు రాజేశ్వరిగారి దంపతులు సేవలను అందిస్తున్నారు.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం.
గురువారం ప్రత్యేకత: భజనలు,విభూతి ప్రసాదం. ఓం సాయి రాం!!
-తోలేటి వెంకట శిరీష