Categories
Wahrevaa

సింపుల్ పరిష్కారం బత్తాయి.

వేసవిలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖంపై నల్ల మచ్చలు కంటి కింద వలయాలు, పెదాలు నల్లబడటం వంటివి సాధారణ సమస్యలు. వీటిని తగ్గించుకునేందుకు ఖరీదైన క్రీములు, ఫేస్ వాష్ లు వాడుతుంటారు. వీటి కంటే సింపుల్ పరిష్కారం బత్తాయి పండులో వుంది. ముఖం శుభ్రంగా కడిగి తుడుచుకుని బత్తాయి సగం చెక్క తీసుకుని గుండ్రని కదలికలతో ముఖాన్ని మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇలా 10-12 నిముషాలు చేసి చల్లని నీటితో కడిగేయాలి. దీనిలోని సిట్రస్ జ్యూస్ సహజ తేలికపాటి క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. బ్లాక్ హిడ్స్ ను నివారిస్తుంది. మెడ వెనుక, ముంజేతుల కింద, మోకాళ్ళు, మోచిప్పల పైన బత్తాయి చెక్క రుద్దుకోవచ్చు. బత్తాయి తోలు గ్రైండ్ చేసి క్రీములాగా అయిన గుజ్జుని రాస్తే మొటిమలు తగ్గిపోతాయి. బత్తాయి రసం రోజుకు మూడు నాలుగు సార్లు పెదవులపై రాస్తుంటే నలుపు పగుళ్ళు పోతాయి.

Leave a comment