Categories
సెల్ఫీ లు ,వాటిని చూడగానే వచ్చే లైకులు ఆనంద పెడతాయి గానీ ఎడా పెడా సెల్ఫీ లుతీసుకోవటం వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి అంటున్నారు వైద్యులు స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం ముడతలు పడుతుందనీ దానివల్ల చిన్నవయసులోనే వృద్ధుల్లా కనిపిస్తారని హెచ్చరిస్తున్నారు . చర్మం కాంతికి దోహద పడే డి.ఎన్.ఎ లపై స్మార్ట్ ఫోన్ నుంచి విడుదల అయ్యే ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాల ప్రభావం చుపిస్తాయంటున్నారు . పైగా ప్రతి సెల్ఫీ ని పట్టించుకోవాలిని సోషల్ మీడియా లో ఎక్కువ లైక్స్ రావాలనే కోరికతో,ఒకవేళ అనుకున్నంత లైక్స్ రాకపోతే వెంటనే డిప్రషన్ కు లోనవుతున్నారని ఇదే అదే ఆలోచనలో పదేపదే సెల్ఫీ లుతీసుకొంటూ ఉంటారు దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది జాగ్రత్త అంటున్నారు అంటున్నారు వైద్యులు .