ప్రజారోగ్యం కోసం సంక్షేమం కోసం పాటుపడే అధికారులు ఎందరో ఉన్నారు .కష్ట సమయంలో ఎంత కష్టానికైనా ఓర్చి విధుల్లో పాల్గొనే వాళ్ళు చాల మంది .పశ్చిమ బెంగాల్ కు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అభిస్మితా ఘోష్ ఏడూ నెలల గర్భిణీ కరోనా సమయంలో ఆమె జాగ్రత్తగా ఉండాలని వైద్యులు ఆమె ను హెచ్చరిస్తున్నా ఆమె దాన్ని లక్ష్య పెట్టలేదు .వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 800 మంది వలస కూలీలు అక్కడే ఉన్నారు .అందులో చాల మంది కేరళకు చెందిన వారే .పశ్చిమ బెంగాల్ జల్ పాయ్ గుడీ జిల్లాలోని షుగర్ మరి హెల్త్ సెంటర్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేసే అభిస్మితా ఆ కూలీలకు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తు ఎంతో బిజీ గా ఉన్నారు .వారికీ ఆరోగ్యం పట్ల అవగాహన లేదు అందుకే కాంపెయిన్లు నిర్వహస్తుంది ఆమె .