సువాసనలకోసం తరాలనుంచి తపిస్తూనే వున్నారు. స్నానం చేసే వాళ్ళంతా ఘుమ ఘుమ లాడాలి. అగరబత్తి వెలిగిస్తే ఇల్లు వాసన రావాలి. సాంబ్రాణి వేస్తారు. అత్తరు పన్నీరు రాస్తారు. సువాసన పట్ల మనిషికుండే ఇష్టం తీరిపోలేదు. ఇప్పుడు తలస్నానం కోసం వాడే షాంపుల్లో రోజంతా నిలిచి వుండే పరిమళం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే షాంపూల్లో తలకి పట్టి ఉండేలా కొన్ని అడవి పూల వాసనలు, పండ్ల వాసనలు చాలా వున్నాయి. ఇప్పుడు పారిస్ లోని నిపుణులు షాంపూల్లోని వాసనలు పెప్టైడ్ అనే పదార్ధం ద్వారా సిరోజాలకు పట్టీ వుండే విధానాన్ని రుపొందించారు. ఇది కనుక సెక్సస్ అయిటే షాంపూ రోజంతా వాసనలు వెదజల్లుతూనే వుంటుంది.

Leave a comment