అందంగా మెరిసిపోవడం అంట ఆషామాషీ కాదు. దీనికెంతో హోమ్ వర్క్ వుంటుంది. అదే సినిమా నటులు కాసేపు ఏ సినిమా ఫంక్షన్ కు వెళ్ళినా ముందర ముడేసి గంటల మేకప్ వేసుకుంటూ గడిపేస్తున్నారు. ఇప్పుడు గొల్లకు రంగు ఫ్యాషన్ అయితే అందులో ఎన్నో డిజైన్లు, బోలెడు అలంకారాలు వచ్చాయి. అలాగే అద్దాల గోర్లు వచ్చాయి. ఈ మెటాలిక్ నెయిల్ ఫాయిల్స్ లో వెండి బంగారు రంగులతో పాటు ఇంకెన్నో రంగుల కాయితాలున్నాయి. ఈ కాయితాల్ని ఎక్కడా ముడతలు లేకుండా గోటికి అతికిస్తే చాలు. అవసరమైతే వాటి పైన పార దర్శకంగా వుండే రంగులు వేస్తె అవి వుడి పోకుండాఉంటాయి. ముందుగా నేచురల్ కలర్ వేసి ఈ మెటాలిక్ నెయిల్ పాయిల్ అంటించి మళ్ళి ఓ సారి నేచురల్ కలర్ వేయాలన్న మాట. గోళ్ళు అద్దాల్లా మెరుస్తాయి.

Leave a comment