ఒక్కసారి ఇంట్లో చూస్తే ఎన్నో రాకాల దుస్తులు అలంకరణ సామాగ్రి ఫ్రిజ్ లో కిక్కిరిసినట్లు బాటిల్స్ చుట్టు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎన్నో కనిపిస్తాయి. కొన్ని అస్సలు వాడనివి కూడా దర్శనమిస్తాయి.కనిపించిన వెంటనే కొనేసే అలవాటు వల్ల ఇలా జరుగుతుంది. అదాయం గురించి అవగాహన ఖర్చు పైన అదుపు ఉంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే షాపింగ్ కు కాస్త పొదుపుగా ఆలోచించే వారిని తోడుగా తీసుకెళ్ళ మంటారు.లేదా షాపింగ్ కోసం ముందే రాసిపెట్టి కొన్న లిస్ట్ వరకే తొందరగా కొనేసి వెంటనే వెనక్కి తిరగమంటారు. అప్పుడు బడ్జెట్ మన చేతిలో ఉంటుంది. అవసరం లేని డిస్కౌంట్ దొరుకుతున్న సరే వద్దనుకునేంత స్థిమితంగా ఉండాలి.

Leave a comment