Categories
వేసుకునే దుస్తులు కళ్ళకి ఆహ్లాదంగా ఉంటే బావుండునని తేలికైన రంగులు చక్కని పువ్వులు లతలు అందాన్ని వెయ్యింతలు చేస్తాయని ఫ్యాషన్ డిజైనర్స్ నిర్ణయించుకున్నారు ఏమోగాని లేటెస్ట్ గా వచ్చే ప్రతి డిజైన్ కూడా చక్కని ఫ్లోరల్ డిజైన్స్ అందమైన ప్రకృతి పచ్చదనం కనిపిస్తూ ఉన్నాయి. లాంగ్ కుర్తీ డిజైన్ లో చూస్తే శాటిన్ , సిల్క్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో ఫ్లోరల్ డిజైన్ లే కనిపిస్తున్నాయి. అసలు పొడుగాటి లాంగ్ కుర్తీలు ఫ్యాషన్ అయిపోతే వాటికి చేసిన గోల్డెన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ మొత్తం పువ్వులు,ఆకులు చివరకు మెడచుట్టూ చేతులకు వేసిన గుండీలు కూడా చిన్ని చిన్ని పువ్వుల్లా కనిపిస్తాయి.