క్షమించటం అన్న నాలుగు అక్షరాలు మన జీవితంలోకి ఎన్నో సుఖ,శాంతులు తీసుకు వస్తాయి. ఎవరి పైన అయినా కోపం తెచ్చుకోవటం అన్నది మనం నేరుగా విషం తాగినంత ప్రమాదం. ప్రతికారేచ్చతో రగిలిపోవడం ముందర మన ఆరోగ్యానికి ప్రమాదం. క్షమాపన ప్రదర్శనలోనే ఆధ్యాత్మిక కోణం దాగి ఉంది అంటారు.క్షమించటం జీవితానికి గుర్తు ఇందులో రెండు లాభాలు ముందు మన మనసు తేలిక అయిపోతుంది. రెండవది అవతల పాడైపోయిన బాంధవ్యం కూడా పునరుద్దరించినట్లే.క్షమించటం వైపు నాలుగు అడుగులు వేస్తే వ్యక్తుల మధ్య దూరం దగ్గరయినట్లే కదా.

Leave a comment