గర్భవతి గా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం వల్ల కొన్ని రకాల ప్రవర్తనా సంబంధిత ప్రభావాలు వుండవచ్చునని కొన్ని పరిశోధనల్లో గుర్తించారు. మొబైల్ ఫోన్స్ తక్కువ స్ధాయిలో ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ విడుదల చేస్తాయి. గర్భం దాల్చాక మొబైల్ ఫోన్స్ వాడకం వల్ల అనారోగ్యం వస్తాయని ఇంకా స్పష్టమైన రిపోర్టు రాలేదు. కానీ ఏది ఎలా వున్నా గర్భవతి గా ఉన్నప్పుడు కేవలం ఫోన్లు , వాట్స్ యాప్ , పేస్ బుక్ వంటి వాటితో గంటల కొద్దీ వదలకుండా ఉండటం కంటే చక్కని హాబీలు , ప్రశాంతమైన ప్రేదేశాల్లో గడపడం , ప్రశాంత మైన ప్రదేశాల్లో గడపడం , వత్తిడి లేకుండా ఉండటం ఉత్తమం. మొబైల్ ఫోన్ల వల్ల నష్టం వస్తుందనే ఆలోచనే వద్దు. సాధ్యమైనంత వరకూ దాన్ని కేవలం కమ్యూనికేషన్ వరకు వాడటమే మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment